Site icon Prime9

Kangana Ranaut: చంద్రముఖిగా కాంట్రవర్సీ క్వీన్ కంగనా.. ఫస్ట్ లుక్ రిలీజ్

kangana-ranaut-play-key-role-in-chandramukhi-2 first look released

kangana-ranaut-play-key-role-in-chandramukhi-2 first look released

Kangana Ranaut: దక్షిణాదిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన చంద్రముఖి మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు కాగా ఈ సినిమాలో ఇప్పుడు రాఘవ లారెన్స్ కథానాయికగా నటిస్తున్నారు. చంద్రముఖి దర్శకుడు పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చంద్రముఖిగా కంగనా రనౌత్ కనిపించనుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో కాంట్రవర్సీ క్విన్ కంగనా నటించనుందని చెప్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, చిత్ర మేకర్స్ కంగనా పోస్టర్‌ను విడుదల చేశారు.

కంగనా పోస్టర్‌లో క్లాసీ, డిజైనర్ లెహంగా ధరించి, పురాతన ఆభరణాలతో చాలా హుందాగా కనిపించింది. మూవీ మేకర్స్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “#చంద్రముఖి2 ప్రపంచంలోకి #కంగనారనౌత్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నామని మూవీ మేకర్స్ తెలిపారు.

అలాగే చంద్రముఖి-2లో లక్ష్మీ మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. హారర్ జోన‌ర్‌లో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చంద్రముఖికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి భాగం చంద్రముఖిలో కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించిన లెజెండరీ కమెడియన్ వడివేలు ఈసీక్వెల్‌లో కూడా సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

kangana-ranaut-play-key-role-in-chandramukhi-2 first look released

అయితే.. బాలీవుడ్‌లో భామ కంగనా తమిళ సినిమాకి కొత్త ఏం కాదు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ అయిన ‘తలైవి’లో కంగనా లీడ్ రోల్ చేసి అటు విమర్శకులను, ఇటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మరి చంద్రముఖితో ఎంతమందిని కంగనా ఆకట్టుకోనుందని తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: భవదీయుడు కాదు “ఉస్తాద్ భగత్ సింగ్”.. పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ సినిమా టైటిల్ మార్పు..!

 

Exit mobile version
Skip to toolbar