Site icon Prime9

Kamal Haasan: కమల్ హాసన్ సరికొత్త రికార్డ్.. 10 నిమిషాల డైలాగ్ 14 భాషల్లో..!

Indian 2 movie latest update

Indian 2 movie latest update

kamal haasan indian 2: వర్సటైల్ యాక్టర్ కమల్‌హాసన్‌ ఇటీవలె విడుదలైన “విక్రమ్” మూవీతో సూపర్ ఫామ్‌లోకి వచ్చారు. చాలా కాలం తర్వాత కమల్ కు సరైన హిట్ పడడంతో తన తదుపరి చిత్రాల్ని మరింత స్పీడ్ గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లోకనాయకుడు ‘ఇండియన్ 2’ మూవీ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కమల్ హాసన్ గుక్కతిప్పకండా 10నిమిషాల నిడివి ఉన్న ఓ డైలాగ్ ను సింగిల్ షాట్ లో చెప్పేసారంట.

గతంలో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్ 2 చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా పై భారీ అంచానాలే ఉన్నాయని చెప్పవచ్చు. కాగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా, రకుల్ ప్రీత్‌సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా బాబీ సింహ, సిద్ధార్ధ్, ప్రియా భవానీ శంకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

మరి అసలు విషయానికొస్తే ఈ సినిమాలో కమల్ హాసన్ డైలాగ్స్ తో ఒక కొత్త రికార్డ్ ను సృష్టించారని సమాచారం. ఇండియన్ 2 సినిమాలో కమల్ పది నిమిషాల డైలాగ్ ను సింగిల్ షాట్‌లో చెప్పారట. దీనిలో విశేషమేంటి? అనుకుంటున్నారా? ఆ ఒకే ఒక్క డైలాగ్‌ను మొత్తం 14 భాషల్లో చెప్పారట. ఆ సీన్‌తో సెట్లో ఉన్నవారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారట కమల్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి కమల్ చెప్పిన ఈ 14 భాషల సింగిల్ టేక్ డైలాగ్ సినిమాలో ఏ స్థాయిలో పేలుతుందో చూడాలి.

ఇదీ చూడండి: దేశంలోనే టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా ప్రభాస్..!

Exit mobile version