Site icon Prime9

Samantha: సమంత మయోసైటిస్ థర్డ్ స్టేజ్‎లో ఉంది.. కల్పిక గణేష్

kalpika-ganesh-samantha

Tollywood: నటి కల్పిక గణేష్ సమంత మయోసైటిస్‌ ఏ స్టేజ్‌లో ఉందో తాజాగా వెల్లడించింది. సమంత నటించిన ‘యశోద’ సినిమాలో కల్పిక గణేష్ ఓ పాత్రలో నటించింది. గత శుక్రవారం విడుదలైన యశోద పాజిటివ్ టాక్‌ తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.20 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ చెప్తోంది. యశోద సక్సెస్ మీట్‌లో మాట్లాడిన కల్పిక గణేష్ సమంతలాగే తాను కూడా మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. అయితే ఈ సక్సెస్ మీట్‌కి సమంత హాజరు కాలేదు.

కల్పిక యశోద సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ మేమంతా సమంతని చాలా మిస్ అవుతున్నాం. సమంత సక్సెస్ మీట్‌కి వస్తున్నారని నాకు అబద్ధం చెప్పారని,అందుకే ఆమె వస్తున్నారని తెలిసి పరుగెత్తుకుంటూ వచ్చాను. నాకు ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ ఉన్నాకూడా వదిలేసి వచ్చాను. మయోసైటిస్‌ నాకు గత 13 ఏళ్ల నుంచి ఉంది. అయితే ఇప్పుడు నేను మొదటి స్టేజ్‌లో ఉన్నాను. కానీ సమంతది థర్డ్ స్టేజ్ అని తెలిపింది.

హ‌రి, హ‌రీష్ ద‌ర్శ‌కత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన యశోద చిత్రం పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజైంది.

Exit mobile version