Prime9

Pawan Kalyan: జల్సా ప్రత్యేక ప్రదర్శనలు.. కోటిరూపాయలు జనసేనకు విరాళమిచ్చిన జనసైనికులు

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు న ఆయన నటించిన ‘జల్సా’ చిత్రాన్ని పలు ధియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్ర ప్రదర్శన ద్వారా జనసేన పార్టీ కార్యకర్తలు రూ. కోటి విరాళాన్నిసేకరించారు. ఈ డబ్బును వారు  నాగబాబు చేతుల మీదుగా పవన్ కళ్యాణ్‌కు అందజేశారు.

నా సేన కోసం నా వంతు” అనే కార్యక్రమానికి జన సైనికుల నుంచి మంచి స్పందన వచ్చింది. పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు రూ. కోటి విరాళం సేకరించి అభిమానం చాటుకున్నారు. పవన్‌తో ఫొటో దిగాలి అన్న దానికే అభిమానులు పరిమితం కాకుండా, ఏదైనా సాధించి, పార్టీ ఎదుగుదల, ఇటు సమాజ హితం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అని నాగబాబు పేర్కొన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా చిత్రంలో ఇలియానా హీరోయిన్. కమలినీ ముఖర్జీ, పార్వతి మెల్టన్, ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి, శివాజీ ముఖ్య పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్‌ పతాకం పై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

Exit mobile version
Skip to toolbar