Site icon Prime9

Vishwak Sen: మనసుకు నచ్చని పని చేయలేకే తప్పుకున్నాను.. విశ్వక్ సేన్

Vishwak Sen

Vishwak Sen

Tollywood: మనసుకు నచ్చని పనిచేయలేకే అర్జున్ సర్జా టీమ్ నుంచి తప్పుకున్నానని నటుడు విశ్వక్ సేన్ అన్నాడు. అర్జున్ చేసిన ఆరోపణల పై విశ్వక్ స్పందించాడు. మాటలు, పాటలు, మ్యూజిక్ విషయంలో తాను కొన్ని సూచనలు చేసానని అయితే అర్జున్ వాటికి ఒప్పుకోలేదని తాను చెప్పినట్లే నడుచుకోవాలని అంటున్నారని తెలిపాడు. తన మాటకు సెట్ లో గౌరవం లేదని అందుకే మనసుకు నచ్చని పనిచేయలేక సినిమా నుంచి తప్పుకున్నానని అన్నాడు. మూవీ రెమ్యూనరేషన్, చెక్కులు, డాక్యుమెంట్లు నిర్మాతలమండలి పంపానని అన్నాడు.

అంతకుముందు అర్జున్ మాట్లాడుతూ విశ్వక్ సేన్‌కు ప్రొఫెషనలిజం లేదన్నారు. దర్శక, నిర్మాతలు అంటే అసలు గౌరవం లేదన్నారు. తానొక దర్శకుడిగా, నిర్మాతగా హార్ట్ అయ్యానని చెప్పారు. వర్క్ పట్ల విశ్వక్ సేన్‌కు కమిట్మెంట్ లేదన్నారు. తనకు వంద కోట్లకు వస్తాయని చెప్పినా, ఎప్పటికీ అతనితో సినిమా చేయనని చెప్పారు.

 

Exit mobile version