Site icon Prime9

Hansika: హన్సిక పెళ్లి చేసుకోబోయే వరుడు ఇతడే.. ఫొటోలు రివీల్

hansika reveled her fiance

hansika reveled her fiance

Hansika: అతిచిన్న వయసులో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలలో హన్సిక ఒకరు. ఈ అందాల తారకు దేశముదురు సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. ఇంక ఆ సినిమాతో హన్సిక ఓవర్ నైట్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఈమె పెళ్లికి సంబంధించి కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాగా వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ తాజాగా ఆమె ఇన్ స్టా వేదికగా తనకు కాబోయే భర్త ఫొటోలను రివీల్ చేసింది.

గత కొన్ని రోజులుగా హన్సిక పెళ్లి గురించి పుకార్లు వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే నవంబర్ 2న, ఆమె తన బాయ్‌ఫ్రెండ్ అయిన సోహెల్ ఖతురియాను వివాహమాడనున్నట్టు వెల్లడించింది. సోహెల్ ఒక ప్రముఖ వ్యాపారి. ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు ఆమెకు సోహెల్ ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. వాటితో పాటు “నౌ అండ్ టుగెథర్” అనే క్యాప్సన్ కూడా జోడించింది. దీనితో ఆమె పెళ్లిపై వస్తున్న పుకార్లకు తెరపడింది. సోహెల్‌తో డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని ఖరీదైన రిసార్ట్‌లో తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకోనుందని ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

ఇదీ చదవండి: “కడలి” హీరోతో.. “నాగచైతన్య” హీరోయిన్ పెళ్లి

Exit mobile version