Site icon Prime9

Chiyaan Vikram: కోబ్రా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో విక్రమ్

kobra prime9news

kobra prime9news

Tollywood: విక్రమ్ నటించిన కోబ్రా సినిమా ఆగస్టు 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉందన్న విషయం అందరికి తెలిసిందే. తెలుగులో తన అభిమానుల కోసం కోబ్రా సినిమాతో ముందుకు వచ్చారు. ఈ సినిమా కోసం మూడేళ్ళ కష్ట పడ్డారని, కేవలం ఆ సినిమాకు ప్రత్యేకంగా ఎక్కువ సమయాన్ని కేటాయించారని తెలిసిన సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా మిక్సీడ్ టాక్ గా నడుస్తుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ కలెక్షన్స్ కూడా అంతమాత్రంగా కలెక్ట్ అవుతున్నాయని తెలిసిన సమాచారం. ఇంకా రెండు రోజులు పోతే కానీ తెలియదు ఈ సినిమా పరిస్థితి. ఎందుకంటే నిన్న అంతా అందర వినాయకుడుకు పూజాలు చేయడమే సరిపోయింది కాబట్టి సినిమా హాల్ కు వెళ్ళి సినిమా చూసే పరిస్థితి లేదు. మరి ఈ రోజు వెళ్ళే వాళ్ళు సినీమాలకు వెళతారు కాబట్టి తెలుగులో మనం ఊహించిన అంచనాలను అందుకుంటుందో లేక యావరేజ్ గా ఉంటుందో వేచి చూడాలి.

ఒక్క గెటప్ వేయగానే అలిసిపోయే మన హీరోస్, విక్రమ్ ఈ సినిమాలో 10 గెటప్స్ లో కనిపించాడు. దాని కోసం విక్రమ్ పగలు, రాత్రి అని తేడా లేకుండా షూటింగ్ చేస్తూనే ఉన్నారట.ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ చేయగా 7 స్క్రీన్ స్టూడియోస్ మరియు రెడ్ జాయింట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో కేజీఎఫ్ అమ్మడు శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. ఐతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే విక్రమ్ ఈ సినిమాకు ఏకంగా 25 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని కోలీవుడ్లో టాక్ నడుస్తుందని తెలిసిన సమాచారం. ఈ వార్తాల పై హీరో విక్రమ్ ఇంకా స్పదించలేదు. మరి ఈ వార్తలు నిజలా? కావా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version