Site icon Prime9

Prabhas Adipurush: ప్రభాస్ “ఆదిపురుష్” టీజర్ డేట్ ఫిక్స్..!

adipurush updates

adipurush updates

Tollywood: యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ చిత్రం అప్‌డేట్‌లు త్వ‌ర‌లోనే రానున్నాయి. వరుస ఫ్లాప్ ల త‌ర్వాత ప్ర‌భాస్ ఆదిపురుష్‌తో ప్రేక్ష‌కుల ముందుకురానున్నాడు. ఓం రౌత్ ద‌ర్శ‌క‌ుడిగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో ఉంది.

అయితే ఆదిపురుష్ షూటింగ్ గ‌డిచి నెల‌లు దాటుతున్నా సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్‌డేట్‌లు రాలేదు. దీనితో డార్లింగ్ అభిమానులు మూవీ మేకర్స్ పై తీవ్ర అస‌హనం వ్య‌క్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న వార్త ఒక‌టి సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దానికి కారణం ఆదిపురుష్ టీజ‌ర్‌ను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 3న విడుద‌ల చేస్తున్నట్టు సమాచారం. రామన‌గ‌రం అయిన అయోధ్య‌లో ఆదిపురుష్ టీజ‌ర్‌ను విడుదల చేయ‌నున్నారని, ఇప్ప‌టికే టీజ‌ర్‌ను క‌ట్ చేసే ప‌నిలో చిత్ర యూనిట్ ఉన్నార‌నే గుసగుసలు వినిపిస్తున్నాయి.

చరిత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో, కృతి స‌నన్ సీత పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా(రావణాసురిడిగా) న‌టిస్తున్నాడు. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12న విడుద‌ల కానుంది.

ఇదీ చదవండి: ఓటీటీలో కార్తికేయ-2… ఈ నెల 30 నుంచే..!

Exit mobile version