Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన యూవీ క్రియేషన్స్ సంస్థ మీద GST అధికారులు రైడ్స్ జరిపిన విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ వర్గాల్లో యూవీ క్రియేషన్స్ సంస్థ పన్ను కట్టలేకపోవడం వల్ల GST అధికారులు మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయాల మీద సోదాలు నిర్వహించినట్లు తెలిసిన సమాచారం. సినిమాలు విడుదల చేసిన సమయంలో పన్ను కట్టకుండా ఉన్నారేమో అనే విషయం మీద అధికారులు తనిఖీ చేసి ఉంటారని ప్రచారం జరుగుతుంది.
ఈ సోదాలు జరిగినట్టు మంగళవారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. ఈ విషయం మీద GST అధికారులు కూడా ఎలాంటి వివరాలు బయటకు రానివ్వలేదు. యూవీ క్రియేషన్స్ సంస్థ మాత్రం ఇలాంటి సోదాలు గతంలో కూడా జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరిగాయని వెల్లడించింది. యువీ క్రియేషన్స్ సంస్థను హీరో ప్రభాస్ సోదరుడైన ప్రమోద్ ఉప్పలపాటి ఆయన స్నేహితులు వంశీకృష్ణారెడ్డి, విక్రమ్ కృష్ణారెడ్డితో కలిసి 2013వ సంవత్సరంలో స్థాపించారు.