Site icon Prime9

Samantha Shakuntalam: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… శాకుంతలం నుంచి దుష్యంతుడి పోస్టర్ రిలీజ్

shakunthalam movie

shakunthalam movie

 Samantha Shakuntalam: తెలుగు సినిమాలకు ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆదర‌ణ లభిస్తోంది. ఈ క్ర‌మంలోనే భారీ బ‌డ్జెట్ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఈ నేపథ్యంలో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ‘శాకుంత‌లం’ చిత్రం కూడా ఈ తరహాలోనే తెర‌కెక్క‌నుంది. కాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ తాజాగా విడుదలయ్యింది. అదేంటో చూసెయ్యండి.

గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న శాకుంతలం మూవీ ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేస‌ుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో నిమగ్నమయ్యింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుదలైన స‌మంత ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ప్రేక్ష‌కులు ఎంతగానో ఆదరించారు. కాగా మైథ‌లాజిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో మ‌ల‌యాళ యువ న‌టుడు దేవ్ మోహన్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. తాజాగా ఈయన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

నేడు మళయాల నటుడు దేవ్ మోహ‌న్ బ‌ర్త్‌డే సందర్భంగా శాకుంతలం సినిమా నుంచి ఈయ‌న ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను చిత్రబృందం విడుద‌ల చేశారు. ఈ మూవీలో దేవ్ మోహ‌న్ దుష్యంతుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. గుర్రంపై యుద్ధ వీరుడి లుక్స్‌తో పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ కీల‌క‌పాత్ర‌ పోషించింది. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీంవ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమాగుణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మెలోడీ కింగ్ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. అత్యంత భారీగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Director Shankar: శంకర్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యష్… క్రేజీ చిత్రం..

Exit mobile version