Site icon Prime9

Sita Ramam: “సీతారామం” సీక్వెల్.. దుల్కర్ సల్మాన్ ఏం చెప్పారంటే..?

sitaramam sequel

sitaramam sequel

Tollywood: ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీక్వెల్‌ చిత్రాల హవా కొనసాగుతుందనే చెప్పాలి. విరివిరిగా సీక్వెల్ సినిమాలు తెరకెక్కుతూ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా చిత్రం మంచి విజయం అందుకుందంటే చాలు. ఆ సినిమా కొనసాగింపుపై సినీ అభిమానులతో సహా ప్రముఖుల వరకూ అంతా దానిపైనే దృష్టి పెడుతున్నారు. కాగా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్‌ కొట్టిన ‘సీతారామం’ సినిమా విషయంలోనూ కొనసాగింపు ఉంటే బాగుండని చాలా మంది భావిస్తున్నారు. కాగా దీనిపై దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సీతారామం చిత్రానికి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా, బాలీవుడులోనూ మంచి ఆదరణ లభించింది. కాగా హిందీనాట ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటి అంటే సీతారామం మూవీకి సీక్వెల్ మూవీ తీస్తారా అని రిపోర్టర్ అడుగగా దానికి దుల్కర్ ‘‘ఏదైనా సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించి, క్లాసిక్‌గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్‌ చేయకూడదనే విషయాన్ని నేను నటుడినికాకముందే తెలుసుకున్నాను. మేం ఈ కథను బాగా నమ్మాం. ‘సీతారామం’ క్లాసిక్‌గా నిలుస్తుందని భావించాం. అనుకున్నట్టుగానే మీరంతా ఈ చిత్రాన్ని మీరు ఎంతగానో ఆదరించారు. అందుకే ఈ సినిమాకు కొనసాగింపు ఉండదనుకుంటున్నా అంటూ దుల్కర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే ఈ అందమైన ప్రేమకథ చిత్రంలో రామ్‌గా దుల్కర్‌, సీతామహాలక్ష్మిగా మృణాల్‌ ఠాకూర్‌ ఒదిగిపోయారు. రష్మిక, తరుణ్‌భాస్కర్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ లవ్‌స్టోరీ దక్షిణాది ప్రేక్షకులతోపాటు ఉత్తరాది సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇదీ చదవండి:  నేషనల్ క్రష్ రష్మిక రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం !

Exit mobile version