Site icon Prime9

Krishnam raju: కృష్ణంరాజు కోరికను ప్రభాస్ తీర్చనున్నారా ?

krishnam raju prime9news

krishnam raju prime9news

Tollywood: రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో విషాధా ఛాయలు కమ్ముకున్నాయి. ఆయన ఆదివారం ఉదయం 03:25 నిముషాలకు హైదరాబాద్‌లోని AIGహాస్పిటల్‌లో మరణించారన్న విషయం మన అందరికీ తెలిసిందే. తెలుగు సిని పరిశ్రమలో ఆయననటనతో కీర్తిని,మంచి పేరును సంపాదించుకున్నారు. కృష్ణంరాజు మరణ వార్తా విని తెలుగ సినీ పరిశ్రమ తల్లడిల్లినది. కృష్ణంరాజు మృతి ప‌ట్ల వ్యాపారవేత్తలు, రాజకీయ వేత్తలు, సినీ నటులందరూ సోష‌ల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపాన్ని తెలిపారు. ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ గురై ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ కు పెద్ద‌నాన్న కృష్ణం రాజు అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసిన విషయమే. ప్రభాస్ వాళ్ళ పెద్దనాన్నతో క‌లిసి వెండితెర‌ పై న‌టించ‌టాన్ని చాలా ఎంజాయ్ చేశారు. ప్రభాస్ కృష్ణంరాజుతో కలిసి టాలీవుడ్లో రెబ‌ల్‌, బిల్లా,ఈ మద్య కాలంలో వచ్చిన రాధే శ్యామ్‌ సినిమాలో నటించారు. ఆయన తెలుగు సినీ పరిశ్రమలో న‌టుడిగా, నిర్మాత‌గా, రాజకీయవేత్తగా త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. కానీ ఆయ‌నకు ఒక కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ప్రభాస్ పెళ్ళి చేయాలని ఎన్నో కలలు కన్నారు. కానీ అవి తీరాకుండానే ఆయన కన్నుమూశారు.

ప్రభాస్ కు గతంలో ఎన్నో పెళ్ళి సంబంధాలు చూశారని, కానీ అవేమీ ప్రభాస్ నచ్చలేదని ఇలా పలు వార్తలు బయటికి వచ్చాయి. ఇప్పటికి ప్రభాస్ వయసు నలబై ఏళ్లు ఐన ఇంకా పెళ్ళి చేసుకుండా ఉన్నారు. గతంలో పలు ఇంటర్వ్యూ లో కృష్ణం రాజు , ప్రభాస్ కు తగ్గ అమ్మాయి దొరకగానే వెంటనే పెళ్ళి చేస్తామని తెలిపారు. ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్ల‌ల్ని ఎత్తుకుని ఆడించి, నాలాగా పెంచాలని ఉందని కృష్ణంరాజు చెప్పారు. కానీ ఆ కోరిక నెరవేరలేదు. మరి ఇప్పటికైనా ప్ర‌భాస్ పెళ్లి మీద నిర్ణయం తీసుకొని, వాళ్ళ పెద్ద నాన్న కోరిక తీరుస్తారా ? లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version