Site icon Prime9

Project K: ప్రాజెక్ట్-K నుంచి అదిరిపోయే అప్డేట్.. దీపిక పదుకునే ఫస్ట్ లుక్ రిలీజ్

prabhas project k team warning to leaks

prabhas project k team warning to leaks

Project K: ప్రాజెక్ట్-K ఇప్పుడు యావత్ భారతదేశ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఇటీవలే ఆదిపురుష్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మూవీ అలరించలేకపోయింది. దాంతో తన నెక్స్ట్ సినిమాలపై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల పోస్టర్లుగానీ, టీషట్లుగానీ ఈ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయనే చెప్పాలి. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్, అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దిశాపటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దీపిక ఫస్ట్ లుక్(Project K)

వైజయంతి మూవీస్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసారు మూవీ మేకర్స్. ఈ పోస్టర్ లో దీపికా పదుకొనె నాచురల్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక శాండియాగో కామిక్ కాన్ లో ప్రదర్శించబడే తొలి భారతీయ చిత్రంగా ప్రాజెక్ట్-కె మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅనేక మంది మూవీ లవర్స్, కామిక్ బుక్స్ అభిమానులు శాన్ డియాగోలో జరిగే ఈ కామిక్ కాన్ ఈవెంట్ కి విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నాలుగు లేదా అయిదు రోజుల పాటు నిర్వహిస్తారు. కాగా ఈ సంవత్సరం జులై 19 రాత్రి పార్టీతో ఈ ఈవెంట్ మొదలై.. జులై 23 వరకు జరుగుతుంది. ఈ ఈవెంట్ లో పాల్గొనటానికి లక్షకు పైగా ఆడియన్స్ రానున్నారు. అయితే జులై 20న ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంతో పాటు ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ పాల్గొననున్నారని సమాచారం అందుతుంది. అలానే ఈ సినిమా (Project K) గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. దీంతో కామిక్ కాన్ లో పాల్గొనబోయే మొదటి ఇండియన్ సినిమాగా ప్రభాస్ ప్రాజెక్ట్ K నిలవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీపై సినీప్రియులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Exit mobile version