Site icon Prime9

Chiranjeevi Vs Balakrishna: సంక్రాంతి బరిలో చిరు-బాలయ్య చిత్రాలు.. వర్రీ అవుతున్న డిస్ట్రిబ్యూటర్లు

Chiru-BalaYya

Chiru-BalaYya

Tollywood: మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం “వాల్తేరు వీరయ్య” మరియు నందమూరి బాలకృష్ణ 107వ చిత్రంగా వస్తున్న “వీరసింహా రెడ్డి”2023 సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి. ఈ రెండుచిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం.

చిరు-బాలయ్య చిత్రాలు ఒక్కసారే రిలీజ్ అవడం వలన కలిగే నష్టాలను వివరించేందుకు ఇటీవల డిస్ట్రిబ్యూటర్ల బృందం మైత్రీ మూవీ మేకర్స్‌ని కలిశారని తెలుస్తోంది. రెండూ మాస్ సినిమాలే. రెండూ ఒక్కసారే విడుదల అవుతున్న నేపధ్యంలో మొదటి రోజు భారీ కలెక్షన్లను ఆశించవద్దని డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకు తెలియజేసినట్లు సమాచారం. అయితే కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయవద్దని నిర్మాతకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు క్లాష్ అయితే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల సంఖ్య తగ్గుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మైత్రీ మూవీస్ విడుదల తేదీ గురించి చిరంజీవి మరియు బాలయ్య ఇద్దరికీ మాట ఇచ్చేసామని చెప్పినట్లు టాక్. రెండు చిత్రాల విడుదలకు కనీసం ఒక్కరోజు అయినా గ్యాప్ ఉంటుంది కానీ ఒక్కటి కూడా వాయిదా వేయబడదని చెప్పినట్లు సమాచారం.

Exit mobile version