Site icon Prime9

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఇంట్లో ఆవకాయ రుచి చూసిన తెల్లదొర

MEGASTAR

MEGASTAR

Hyderabad: బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో షేర్ చేశారు. యూకే మరియు అభివృద్ధి చెందుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ మధ్య సహకారం గురించి పలు అంశాల పై ఇరువురు చర్చించినట్లు చిరు తెలిపారు.

హైదరాబాద్‌కు కొత్తగా వచ్చిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్ విన్ ఓవెన్‌ను కలవడం ఆనందంగా ఉంది. బ్రిటన్, భారత్‌కు సంబంధించిన పలు అంశాల పై ఇరువురూ చర్చించుకున్నాం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలతో యూకేకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఆయనకు విందు ఏర్పాటు చేసి, మన తెలుగు వంటకాలను రుచి చూపించా. నోరూరించే అవకాయను కూడా ఆయన రుచి చూశారు అంటూ చిరంజీవి ట్వీట్ చేసారు.

మరోవైపు చిరంజీవి ట్వీట్ పై బ్రిటిష్ హైకమీషనర్ కూడ స్పందించారు. మీ అందమైన ఇంట్లో నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు, ఇంట్లో చేసిన దోసె మరియు ఆవకాయను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇది నాకు చాలా కాలంగా గుర్తుండిపోయే ప్రత్యేక సాయంత్రం. మీ రక్తదాన కేంద్రాలలో ఒకదానిలో మిమ్మల్ని కలవాలని నేను ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు.

Exit mobile version