Site icon Prime9

Brahmastra Pre Release Event: బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

Brahmastra Pre Release Event

Brahmastra Pre Release Event: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితా బ్ బచ్చన్, మౌనీ రాయ్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మూడు పార్ట్ లుగా విడుదల కానుంది.

తొలి భాగం ‘బ్రహ్మాస్త్రం: శివ’ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలో సర్ ప్రైజెస్ కూడా ఉన్నాయని మేకర్స్ చెప్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ని ఈరోజు ( సెప్టెంబర్ 2) వ తేదీన హైదరాబాదులో నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు కూడా తెలిపారు. అయితే అనుకోకుండా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. పర్మిషన్ లేని కారణంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అక్కడికి చేరుకున్న కొంతమంది అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిందని తెలియడంతో నిరాశతో తిరిగి వెళ్ళిపోతున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ మరియు మౌని రాయ్ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. బిగ్ బాస్ తెలుగులో బ్రహ్మాస్త్ర టీమ్ కూడా హాజరుకానుంది. దీనికి సంబంధించి ఈరోజు షూటింగ్ పూర్తయింది.

Exit mobile version
Skip to toolbar