Site icon Prime9

Bomma Blockbuster: బొమ్మ బ్లాక్ బ్లస్టర్ సినిమా సక్సెస్ మీట్

Bomma Block Buster movie success meet

Tollywood: విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై నందు విజ‌య్‌కృష్ణ హీరోగా.. యాంక‌ర్ ర‌ష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌’. ఈ నెల 4 న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతుంది. అయితే ఈ రోజు నుండి మరి కొన్ని థియేటర్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెంచుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన బోసుబాబు మాట్లాడుతూ.. నందు,విరాట్, రష్మీ లు ఎంచుకొన్న కథకు. సీనియర్ ఆర్టిస్టులను కాకుండా కొత్త ట్యాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చెయ్యాలని ఉద్దేశ్యంతో తీసిన మా సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. దాంతో ఈ రోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ను పెంచుతున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు.ఈ సినిమా సక్సెస్ తో విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై మంచి సినిమాలు తియ్యాలనే ప్రెజర్ పెరిగింది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మా ధన్యవాదములు అన్నారు.

చిత్ర దర్శకుడు రాజ్ విరాట్ మాట్లాడుతూ..నా ఈ ఫస్ట్ ప్రాజెక్ట్స్ లో విడుదలైన “బొమ్మ బ్లాక్ బస్టర్” సినిమాకు ప్రేక్షకులనుండి ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. దీనికి హీరో నందు ,హీరోయిన్ రష్మీ , నిర్మాతలే ప్రధాన కారణం. వీరి సపోర్ట్ చేయడం వల్లే నాకింత మంచి పేరు వచ్చింది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ వచ్చి చూసేలా ఉంటుందని అన్నారు.

చిత్ర హీరో నందు విజ‌య్‌కృష్ణ మాట్లాడుతూ..ఇంతమంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదములు. ఇందులో నేను చేసిన పాత్రకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది..ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోతురాజు అనే క్యారెక్టర్ తో ట్రావెల్ చేస్తారు. అలాగే ఇందులో ఉన్న పోకిరి సీన్ మాత్రం అందరికీ నచ్చుతుంది. భాస్కరపట్ల రాసిన నాన్న సెంటిమెంట్ కు అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి కథతో థియేటర్స్ లలో విడుదలైన మా సినిమాను చూసి ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరోయిన్ రష్మీ గౌతమ్ మాట్లాడుతూ.. మంచి కథను సెలెక్ట్ చేసుకొని అంతా కొత్త వారితో మేము తీస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అనుకున్నాము.అయితే మేము అనుకున్న దానికి భిన్నంగా ప్రేక్షకులు మా కథను రిసీవ్ చేసుకున్నారు. వారందరికి ధన్యవాదములు. ఇందులో నాన్న, సెంటిమెంట్ కు అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఇందులో నన్ను వాణి క్యారెక్టర్ లో దర్శకుడు బాగా చూయించారు.హీరో నందు పోతురాజు క్యారెక్టర్ కు స్మాల్ టౌన్ నుండి వచ్చే ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతారు.ఇంకా మా సినిమా చూడని వారుంటే చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని అన్నారు.

లేటెస్ట్ సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version