Site icon Prime9

హరిహర వీరమల్లు: పవన్ అభిమానులకు పూనకాలే.. హరిహర వీరమల్లు సెట్లో బాలీవుడ్ యాక్టర్ బాబీడియోల్

Bollywood actor bobby deol joined pawan kalyan movie hariharaveeramallu shoot sets

Bollywood actor bobby deol joined pawan kalyan movie hariharaveeramallu shoot sets

HariHaraVeeraMallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడీ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం “హరి హర వీర మల్లు”. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియన్ మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పలువురు టాలీవుడ్, బాలీవుడు తారాగణం ప్రముఖ పాత్రలు పోషించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూట్ లో తాజాగా మరో అదనపు ఆకర్షణ తోడయ్యింది.

ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ ఈ చారిత్రాత్మక మూవీటీంలో నేటి నుంచి అధికారికంగా వచ్చి చేరారు. ఈ సినిమాలో ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. కాగా షూటింగ్ లో పాల్గొనడానికి నేడు హైదరాబాద్ వచ్చారు. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నట్టు సమాచారం. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి వెండితెరపై గొప్ప అనుభూతిని పంచాలన్న ఉద్దేశంతో మూవీ టీం ప్రతి చిన్న అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అయితే ఇటీవల హరి హర వీర మల్లు చిత్ర యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో 40 రోజుల పాటు 900 మంది సిబ్బందితో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇకపోతే కొన్ని వారాల క్రితం విడుదలైన హరి హర వీర మల్లు గ్లింప్స్ కు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పవన్ అభిమానులే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు సైతం ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి: ధమాకా: మాస్ మహారాజా మరోసారి దుమ్ములేపాడా?.. ధమాకా మూవీ రివ్యూ ఎలా ఉందంటే..?

Exit mobile version