Allu Arjun: దేశ సినీ చరిత్రలో అల్లు అర్జున్ అరుదైన రికార్డు సాధించాడు. సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన అల్లు అర్జున్ హవా కనిపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా ప్రతి చోట బన్నీ పేరు మార్మోగిపోతుంది. అవార్డు ఫంక్షన్ ఏదైనా సరే అందులో బన్నీ పేరు కచ్చితంగా ఉంటుంది. అయితే గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో అల్లుఅర్జున్ నటనకు ఇప్పటికే ఫిలింఫేర్, సైమా అవార్డులు కైవసం కాగా ఇప్పుడు మరో అత్యున్నత అవార్డును అందుకున్నాడు బన్నీ.
ఎంటర్‌టైన్ కేటగిరిలో తాజాగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అల్లు అర్జున్ గెలుచుకున్నాడు. ఈ అవార్డును మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతులు మీదుగా బన్నీ ఈ అవార్డును అందుకున్నాడు. అయితే ఈ కేటగిరిలో అల్లుఅర్జున్‌తో పాటు రాజమౌళి(ఆర్‌ఆర్‌ఆర్), వివేక్ అగ్నిహోత్రి(ది కాశ్మీర్ ఫైల్స్), ఆలియాభట్(గంగూబాయ్ కతియావాడి), కార్తిక్ ఆర్యన్(భూల్ భూలైయా-2)లు కూడా నామినేట్ అయ్యారు. కానీ జ్యూరి మాత్రం ఈ అవార్డుకు అల్లు అర్జున్‌ను ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా ఈ అవార్డు గెలిచిన మొదటి సౌత్ హీరోగా అల్లుఅర్జున్ రికార్డు సృష్టించాడు.
ఇదీ చదవండి: కేసీఆర్ బయోపిక్ తీయ్యలని ఉంది- ఆర్జీవి