Site icon Prime9

Allu Arjun: అర్హతో కలిసి బన్నీ నైట్ రైడ్.. ఫొటో వైరల్

allu arjun and arha night ride photo

allu arjun and arha night ride photo

Allu Arjun: అల్లు అర్జున్ ఈ యువ టాలెంటెడ్ స్టైలిష్ స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హీరో సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి అంతే ప్రధాన్యత ఇస్తాడనడంలో సందేహంలేదు. షూటింగ్స్ లేని సమయంలో ఫ్యామిలీతో కలిసి సరదాగా ట్రిప్ లకు వెళుతుంటాడు బన్నీ. పిల్లలతోనే తన సమయాన్ని గడుపుతూ చాలా ఆనందంగా గడుపుతూ ఆ ఫొటోలను వీడియోలను తన అభిమానులతో నెట్టింట పంచుకుంటాడు.

ముఖ్యంగా కూతురు అర్హ అంటే బన్నీకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్హ చిన్నప్పటి తనతో ఉండే అనుభవాలను తన క్యూట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉండేవాడు ఈ స్టైలిష్ స్టార్. ఇప్పుడు కూడా బన్నీ అప్పుడప్పుడు అర్హ ఫొటోలు మరియు వీడియోలు కానీ పోస్ట్ చేస్తూనే ఉంటాడు. కాగా ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవాల్లో అలాగే గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అల్లు అర్జున్, అర్హ సందడి చేసిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా మరోసారి వీరిద్దరి ఫొటో వైరల్ గా మారింది. కూతురితో కలిసి అల్లు అర్జున్ కారులో నైట్ రైడ్ కు వెళ్లారు. కారులోనే అల్లు అర్జున్, అర్హ ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ తండ్రీకూతుర్లు కారులో నైట్ రైట్ చేస్తూ టిఫిన్ చేస్తున్న ఈ ఫొటోను కూడా నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: “వారసుడు” నుంచి తాజా అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేస్తుంది

Exit mobile version