Site icon Prime9

Allu Aravind: దిల్ రాజుకు మద్దతుగా అల్లుఅరవింద్

Allu Aravind

Allu Aravind

Tollywood: సంక్రాంతికి తెలుగునాట తమిళ డబ్బింగ్ చిత్రాలను విడుదల చేయకూడదని తెలుగు సినిమాలకు ధియేటర్లు కేటాయించాలని తెలుగు నిర్మాతల మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతికి విజయ్ వారసుడు చిత్రాన్ని ఇక్కడ రిలీజ్ చేయకూడదన్నది వారి నిర్ణయం. అయితే టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాత్రం అది సాధ్యం కాదని అన్నారు.

బాలీవుడ్ లో వరుణ్ ధావన్ నటించిన భేడియా చిత్రాన్ని తెలుగులో అరవింద్ తోడేలు పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలో, ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్‌ని చూస్తారని అరవింద్ అన్నారు. అల్లు అరవింద్ కన్నడ సెన్సేషనల్ ఫిల్మ్ కాంతారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా ప్రకటించబడింది. దీనితో ఒక నిర్మాతగా తన మనసులో మాటను చెప్పారా లేక దిల్ రాజుకు సపోర్టగా నిలిచారా? అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలు విడుదలవున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో తాను తమిళంలో విజయ్ తో నిర్మించిన వారసుడు చిత్రం తెలుగు అనువాదాన్ని తేవాలని దిల్ రాజు తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. దీనిపై దిల్ రాజు మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు.

Exit mobile version