Site icon Prime9

Allu Aravind: కుర్ర హీరోలకు అల్లు అరవింద్ కౌంటర్

allu aravind prime9news

allu aravind prime9news

Tollywood: ఒకప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో ఈయన ఎన్నో సినిమాలు చేసి హిట్స్, సూపర్ హిట్స్ అందుకున్న అల్లు అరవింద్ చాలామంది స్టార్ట్ హీరోలతో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఐతే ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం విరామం తీసుకొని కొత్త వాళ్ళకు అవకాశం కల్పిస్తూ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ స్థాపించి బన్నీ వాసు చేత సినిమాలు నిర్మిస్తున్నారు. ఐతే తాజాగా అల్లు అరవింద్ ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఇప్పటి హీరోల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలను ఆసక్తికర వ్యాఖ్యలు అనడం కంటే ఒక రకంగా ఆయన హీరోలందరికి పెద్ద కౌంటర్ వేశారనే చెప్పుకోవాలి. అలాగే ఒకప్పుడు నిర్మాతలు హీరోలను ఎంచుకునేవారని కానీ ఇప్పుడు అలా లేదు. హీరోలే కథలు ఫైనల్ ఐనా తర్వాత ఫలానా నిర్మాతతో సినిమా చేద్దామని ముందుకు వెళుతున్నారని కుర్ర హీరోలందరకు అర్థం అయ్యేలా ఆయన కామెంట్లు చేశారు.

ఆలీ మీరు ఒక నటుడి కుమారుడు కదా మరి మీకు సినిమాల్లోకి రావాలని అనిపించలేదా, ఎందుకు నిర్మాణ రంగం వైపును ఎంచుకున్నారని ప్రశ్నిస్తే, దానికి అల్లు అరవింద్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. అదేమిటంటే తాను ఒక పని వాడిగా ఉండాలనుకోలేదని ఒక పని చేసే వాళ్ళకి జీతం ఇచ్చేవాడిగా ఉండాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు.

Exit mobile version