Site icon Prime9

Kushi Re release: ఖుషీ రీరిలీజ్: థియేటర్‌లో అకీరా నందన్.. రచ్చరచ్చ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

Akhira nandan watched khushi re released movie

Akhira nandan watched khushi re released movie

Kushi Re release: ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్‌ ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల పుట్టిన రోజులకు, పలు ముఖ్యమైన సందర్భాలను పురస్కరించుకుని వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కాగా ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యి.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. పాత సినిమాలను నేటి టెక్నాలజీని జోడించి చిన్నచిన్న మార్పులు చేసి మరలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” సినిమాను కూడా 31 డిసెంబర్ శనివారం రోజున కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేలా రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాను చూడడానికి పవన్ తనయుడు అకీరా నందన్ సైతం థియేటర్కు వెళ్లాడు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి 70ఎంఎం థియేటర్లో తండ్రి సినిమాను చూడడానికి వచ్చిన అకీరాను చూసిన ఫ్యాన్స్ ఫుల్ సందడి చేశారు. ప్రస్తుతం ఖుషీ సినిమాను చూడడానికి వచ్చిన అకీరా వీడియోలు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Akira nandan watched kushi rereleased movie

ఇకపోతే ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము లేపాయనే చెప్పవచ్చు. దాదాపు కోటి రూపాయలకుపైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇకపోతే ఈ సినిమా చిన్న సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లను కొల్లగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ… ఫ్యాన్స్ హంగామాతో ఓ మానియాను క్రియేట్ చేస్తోంది. సుమారు 500 లకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో థియేటర్లను దద్దరిల్లుతున్నాయి.

Exit mobile version