Site icon Prime9

Thunivu: “తెగింపు” చూపిస్తున్న అజిత్ కుమార్.. యాక్షన్ ఎంటర్టైనర్ గా “తునివు” ట్రైలర్ వచ్చేసింది

thunivu movie review

thunivu movie review

Thunivu: తమిళ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తునివు’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. అజిత్‌తో ‘వలిమై’ తీసిన దర్శకుడు హెచ్.వినోద్ ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించారు. ఇక అజిత్, వినోద్ కాంబోలో ఈ మూవీ రూపొందుతుండడంతో అజిత్ ఫ్యాన్స్‌తో పాటు తమిళ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో, ఈ సినిమాతో మరోసారి వీరిద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని కోలీవుడ్ వర్గాల నుంటి టాక్.

ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను శరవేగంగా చేపడుతోంది. ఈ తరుణంలోనే తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్లో బ్యాంక్ దోపిడి చేసే
ముఠాకు లీడర్‌గా అజిత్ ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని అజిత్ చేసే యాక్షన్ సన్నివేశాలు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కేవలం తమిళవర్షన్లో మాత్రమే విడుదలయ్యింది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రైలర్ను నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేయనున్నట్టు సమాచారం.

కాగా, ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, సముథ్రకని మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, తెలుగులో ఈ సినిమాను ‘తెగింపు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్.

Exit mobile version