Site icon Prime9

Adipurush OTT: ఓటీటీలోకి రానున్న ఆదిపురుష్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Adipurush OTT release date

Adipurush OTT release date

Adipurush OTT: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈ నెల 16న ప్రపంచం వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హిందీ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. డార్లింగ్ ప్రభాస్ అభిమానులు కూడా దర్శకుడు ఓంరౌత్ పై మండిపడుతున్నారు. దాదాపు 500 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్లను అయితే రాబట్టింది కానీ ప్రేక్షకులను నిరాశపరిచింది.

ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ భామ కృతిసనన్ సీతగా కనిపించి మెప్పించారు. రామాయణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో గ్రాఫిక్స్ మైనస్ అయ్యాయి. ముఖ్యంగా రామాయణ కథను మార్చి చూపించారని వివాదాలు రేగాయి. ముఖ్యంగా రావణాసురుడి పాత్ర విషయంలో అయితే బాగా ట్రోల్స్ నడిచాయి. రావణబ్రహ్మను తప్పుగా చూపించారని కొందరంటుంటే.. మరికొందరు ఏకంగా రామాయణాన్ని పక్కన పెట్టి ఏదో హాలీవుడ్ సినిమాలను చూసి ఈ మూవీని తెరకెక్కించారంటూ మండిపడుతున్నారు.

రిలీజ్ ఎప్పుడంటే(Adipurush OTT)

ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఆదిపురుష్ మంచి ఓపినింగ్స్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. కానీ రానురాను ఈ మూవీ కలెక్షన్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఇదిలా ఉంటే పట్టుమని రెండు వారాలు కూడా కాకముందే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర వార్త ఒకటి వైరల్ అవుతుంది.

ఆదిపురుష్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ పై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీని ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఓటీటీలో రిలీజ్ చేయనున్నారన్న వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి త్వరలోనే దీని పై అప్డేట్ ఇవ్వనున్నారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమాలో లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమాన్ గా దేవ్ దత్త్ ఇక రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం అందరికీ తెలిసిందే.

Exit mobile version
Skip to toolbar