Site icon Prime9

Tollywood: సీఎంను కలిసే ఆలోచనలో సినీ ప్రముఖులు

Tollywood Plan to Meet CM Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసే ఆలోచన సినీ ప్రముఖులు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ డాకు మాహారాజ్‌ మూవీ ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డైరెక్టర్‌ బాబీ, నిర్మాత నాగవంశీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మూవీ బెనిఫిట్‌ షో, ప్రీమియర్‌ షోలు ఉంటాయా? అని నిర్మాత నాగవంవీని ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఈ విషయమై తాము సీఎంను కలుస్తామన్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌ నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో సినీ ప్రముఖులు సీఎంను కలిసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్‌ షోలు బ్యాన్‌ చేస్తున్నట్టు సినిమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అలాగే సీఎం రేవంత్‌ రెడ్డి కూడా తన ఉన్నంత కాలం ఇక బెనిఫిట్‌ షోలు ఉండని అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ అంశంపై మీడియా నాగవంశిని ప్రశ్నించారు. ప్రస్తుతం నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు అమెరికాలో ఉన్నారు.

‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రమోషన్స్‌ భాగంగా ఆయన ఇటీవల అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక సీఎంను కలుస్తాం. ఆ సమయంలో టికెట్‌ ధరల పెంపుతో పాటు ప్రీమియర్‌ షోలపై చర్చిస్తాం. నా చిత్రం డాకు మహారాజ్‌ కంటే దిల్‌ రాజు గేమ్ ఛేంజర్‌ మూవీ ముందే రిలీజ్‌ అవుతుంది. కాబట్టి టికెట్‌ ధరల విషయంలో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో అందరికి అదే వర్తిస్తుంది” అని నాగవంవీ అన్నారు. తాము అని సినిమాల విషయంలో మాట్లాడలేమని, ఏ సనిమాకు అయితే టికెట్‌ ధర పెంపు అవసరమో వాటికి మాత్రం అడుగుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాగవంశీ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Exit mobile version