Site icon Prime9

Pushpa 2 : పుష్ప 2 లో టైగర్ జిందా హై విలన్

Pushpa 2

Pushpa 2

Tollywood News: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా “పుష్ప” 2 పై ప్రస్తుతం పనిచేస్తున్నాడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి  ప్రతిభావంతులైన నటీనటులను ఎంపిక చేస్తున్నాడు.  తాజా అప్‌డేట్ ఏమిటంటే, అతను ఇప్పుడు విదేశీ నటుడిని ఈ సినిమాలోకి తీసుకున్నాడు అతను రెండు సూపర్ హిట్లలో టెర్రరిస్ట్ పాత్రలో నటించి పాపులర్ అయ్యాడు.

సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హైలో విలన్ అబూ ఉస్మాన్ పాత్రలో నటించిన సజ్జాద్ డెలాఫ్రూజ్ అందరికీ గుర్తుంటాడు. అతను తరువాత హాట్‌స్టార్ యొక్క సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘స్పెషల్ ఆప్స్’లో కూడా పేరుమోసిన టెర్రరిస్ట్ ఇఖ్లాక్ ఖాన్ పాత్ర పోషించాడు. ఇరాన్‌లో జన్మించి యూఏఈ లో పెరిగిన అతను హాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో చాలా చిన్న పాత్రలు చేశాడు.రెండు విజయవంతమైన ప్రాజెక్ట్‌ల తర్వాత అతను భారతదేశంలో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అతను పుష్ప 2లో కూడా భాగం కావచ్చని తెలుస్తోంది.ఈ సినిమాలోకి సజ్జాద్ ఎంట్రీ దాదాపుగా కన్ ఫర్మ్ కొందరు అంటున్నారు.

“పుష్ప: ది రూల్”లో, అల్లు అర్జున్ నల్లమల అడవులకు డాన్‌గా మారడమే కాకుండా, రెడ్ శాండిల్ ను అమ్మడానికి  ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌లను కూడా కలుస్తాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అటు పరిశ్రమ, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Exit mobile version