Site icon
Prime9

New Releases : ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమా/ వెబ్ సిరీస్ ల వివరాలు..

this week movies/web series new releases in theatre and ott

this week movies/web series new releases in theatre and ott

New Releases : సినీ పరిశ్రమలో ప్రస్తుతం చిన్నా సినిమాల హవా నడుస్తుందనే చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా పలు చిన్నా, పెద్ద సినిమాల ఇటీవల కాలంలో మంచి హిట్ లు అందుకున్నాయి. అదే రీతిలో ఈ వారం కూడా పలు సినిమాలు/వెబ్ సరీస్ లు రిలీజ్ థియేటర్/ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు..

కబ్జ.. 

కన్నడ స్టార్స్‌ ఉపేంద్ర హీరోగా నటించిన చిత్రం ‘కబ్జ’. ఈ సినిమాలో కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్‌. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.. 

ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో నాగశౌర్యకు జోడిగా నటించి వెండితెరపై మ్యాజిక్ చేసిన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/సిరీస్ లు..

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు..

‘సార్‌’ – కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ తొలిసారిగా తెలుగులో కథానాయకుడిగా నటించిన చిత్రం సార్‌. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదలై సూపర్‌ హిట్‌ కొట్టింది. సంయుక్తా మీనన్ హీరోయిన్. స‌ముద్రఖ‌ని, హైప‌ర్ ఆది, తనికెళ్ళ భరణి, అక్కినేని సుమంత్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. ఇక థియేటర్‌ ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. ఈ నెల 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

మనీషాట్- మార్చి 15

కుత్తే (హిందీ చిత్రం)- మార్చి 16

షాడో అండ్ బోన్(వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 16

మేస్ట్రో(వెబ్ సిరీస్)- మార్చి 17

ఇన్ హిజ్ షాడో మార్చి(సినిమా)- మార్చి 17

ది మెజిషియన్ ఎలిఫెంట్(సినిమా)- మార్చి 17

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు..

బ్లాక్ ఆడమ్(ఇంగ్లీష్)- మార్చి 15

డోమ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 17

ఆహా..

సత్తిగాని రెండెకరాలు – ‘పుష్ప’ స్నేహితుడిగా నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసిన జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. దీనికి అభినవ్ రెడ్డి దర్శకుడు. వెన్నెల కిశోర్ .. మోహనశ్రీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్న ఈ మూవీ మార్చి 17వ తేదీ నుంచి ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

లాక్డ్ (వెబ్ సిరీస్ సీజన్ 2)- మార్చి 17

జీ5.. 

రైటర్‌ పద్మభూషన్‌ – కలర్‌ ఫోటో ఫేమ్‌ సుహాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్‌ పద్మభూషన్‌’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని మంచి విజయం సాధించింది. షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్దమైంది. మార్చి 17నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

లాక్(తమిళం)- మార్చి 17

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..

పాప్ కౌన్(హిందీ సిరీస్)- మార్చి 17

సోనీ లివ్..

రాకెట్ బాయ్స్(హిందీ సిరీస్ 2)- మార్చి 16

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar