Site icon Prime9

Dussehra : ’దసరా‘ యూనిట్ కు 28 ఐఫోన్ 14 మొబైళ్లను గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత

Dussehra

Dussehra

Tollywood News: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం ’దసరా‘. నిర్మాత సుధాకర్ చెరుకూరి దసరా చిత్ర బృందానికి ఖరదైన మొబైల్ పోన్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది. సుధాకర్ సినిమా రూపుదిద్దుకున్న విధానం పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు . యూనిట్ కష్టపడి పనిచేసినందుకు గాను వారికి మంచి గిఫ్ట్ ఇచ్చాడు.

సాధారణంగా సినిమా సక్సెస్ అయిన తర్వాత నిర్మాతలు లేదా స్టార్లు టీమ్‌కి బహుమతులు ఇస్తారు. కానీ చాలా అరుదుగా, వారు సినిమా షూటింగ్ తర్వాత బహుమతులు ఇస్తారు. అయితే సుధాకర్ ముందుగానే యూనిట్ కు 28 సరికొత్త ఐఫోన్ 14 మొబైల్‌లను బహుమతిగా అందించారు. ఇది సినిమా విజయంపై అతని నమ్మకాన్ని తెలియజేస్తోంది

’దసరా‘ శ్రీకాంత్ ఒదెల రచన మరియు దర్శకత్వం వహించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం. నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ ఎత్తున నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి 23, 2023న విడుదల చేస్తున్నారు.

Exit mobile version