Site icon Prime9

Actress Divya: మరో నటితో భర్త వివాహేతర సంబంధం.. పోలీసులను ఆశ్రయించిన బుల్లితెర నటి

actress divya Sridhar

actress divya Sridhar

Actress Divya: సినీ పరిశ్రమలో మరియు బుల్లితెర నాట ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సాధారణ విషయంగా మారిపోతుంది. కాగా ఇటీవల మరో నటి ఈ తరహా ఘటనతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. భర్త తనని మోసం చేశాడంటూ బుల్లితెర నటి దివ్వ శ్రీధర్‌ పోలీసులను ఆశ్రయించింది. మరో నటితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తాను గర్భవతి అని కూడా తెలిపింది. సన్‌టీవీలో ప్రసారమయ్యే తమిళ సీరియల్‌ సెవ్వంధీతో దివ్వ శ్రీధర్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

తమిళ సీరియల్ నటి దివ్య శ్రీధర్ తన భర్త తనని మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. తన సహనటుడైన ఆర్నవ్‌తో ప్రేమలో పడిన ఈమె పెళ్లికి ముందు వీరిద్దరు కొద్ది రోజులు రిలేషన్‌షిప్‌ ఉన్న అనంతరం సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. అదే సమయంలో వారి వివాహ విషయాన్ని ఎవరికీ చెవ్వద్దని ఆర్నవ్ అన్నట్టు ఆమె పోలీసులుకు తెలిపింది. కాగా అదే సమయంలో అతడు మరో నటితో ప్రేమలో ఉన్నాడని, దానితో భర్తను నిలదీసి అందరి సమక్షంలో తనని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో కాంచీపురంలోని ఓ ఆలయంలో మళ్లీ పెళ్లి చేసుకున్నామని పోలీసులకు తెలిపింది.

కాగా ప్రస్తుతం తాను గర్భవతి అని, అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు ఆమె తెలిపింది. ఆర్నావ్‌ వల్ల తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని, తనకి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.

ఇదీ చదవండి: ప్రేమించడం లేదని యువతిని చంపేశాడు

Exit mobile version