Site icon Prime9

Allu Arjun: అల్లు అర్జున్‌ వివాదంపై తెలంగాణ డీజీపీ రియాక్షన్‌ – చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..

Telanga DGP About Allu Arjun Arrest: సంధ్య థియేటర్‌ ఘటన, అల్లు అర్జున్‌ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆదివారం అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ రెడ్డి అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు హట్‌టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత అల్లు అర్జున్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టి సీఎం వ్యాఖ్యలను ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన క్యారెక్టర్‌ దిగజార్చేలా వ్యవహరించారంటూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్‌ వివాదం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఈ వ్యవహరంపై తెలంగాణ డీజీపీ స్పందించారు. దేశ పౌరులందరు బాధ్యతయుతంగా ఉండాలని హితవు పలికారు. కరీంనగర్‌ జిల్లాలో కొత్తపల్లిలో భరోసా కేంద్రం ప్రారంభం సందర్భంగా తెలంగాణ డీజీపీ జితేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో పాటు సినీ నటుడు మోహన్‌ బాబు కేసుపై మాట్లాడారు. వ్యవక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.

మేం అల్లు అర్జున్ కు వ్యతిరేకం కాదు..

“సంధ్య థియేటర్‌ ఘటన దురదృష్టకరమన్నారు. పౌరుల భద్రత, రక్షణ అన్నికంటే ముఖ్యం. మహిళలు ,పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది. బాధితులకు మేము సపోర్ట్ చేసి సాయం అందిస్తాం. ఆయన సినిమా హీరో కావోచ్చు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదు. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్‌ ముఖ్యం కాదు. అత్యుత్సహం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మేము హీరోలకు వ్యతిరేకం కాదు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.

అది మోహన్ బాబు ఇంటి సమస్య

ఇక మోహన్‌ బాబు కేసుపై కూడా మాట్లాడారు. జర్నలిస్ట్‌ దాడి ఘటనలో మోహన్‌ బాబుపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనపై కేసు నమోదైందని, చట్టపరంగా ముందుకు వెళతామాన్నారు. ఇక ఫ్యామిలీ ఇష్యూపై స్పందిస్తూ.. అది వారి కుటుంబ సమస్య అని, వాళ్ళు వాళ్లు మాట్లాడుకుంటే పర్వాలేదన్నారు. ఇంటి సమస్య కాబట్టి వాళ్లే పరిష్కరించుకోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్ సూచించారు.

Exit mobile version