Site icon Prime9

Tamannah: పెళ్లి గురించి ఓపెన్ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా

tamannah shocking comments about her marriage

tamannah shocking comments about her marriage

Tamannah: హ్యాపీ డేస్ చిత్రంతో కుర్రకారు గుండెల్ని దోచుకుని తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది మిల్కీ బ్యూటీ ” తమన్నా ” . తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలలో ఒకరిగా కొనసాగుతుంది ఈ బ్యూటీ. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన కూడా నటించి తన టాలెంట్ ని నిరూపించుకుంది తమన్నా. మెగాస్టార్ చిరుతో సైరా, విక్టరీ వెంకటేశ్ కి జోడీగా ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలలో అలరించింది. కాగా ఇప్పుడు ప్రస్తుతం త్వరలోనే ” గుర్తుందా శీతాకాలం ” అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది ఈ భామ.

ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా… సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ తరుణంలోనే మూవీ ప్రమోషన్లను వేగవంతం చేసింది మూవీ యూనిట్. ఈ మేరకు తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఆ మీడియా సమావేశంలో తమన్నా మాట్లాడుతూ… నన్ను నేను ఓ మంచి నటిగానే చూసుకోవాలనుకుంటున్నాను. అందుకే పాత్ర నిడివిని కాకుండా ఆ పాత్ర ప్రభావం బలంగా ఉంటే ఓకే చెప్తానని తెలిపింది. అలానే పలు వెబ్ సైట్లలో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఓ డాక్టర్ తో వివాహం కూడా జరిగినట్లు ఫెక్ న్యూస్ రాస్తున్నారంటూ చెప్పారు. పెళ్లి అనేది జీవితంలో ఒక పెద్ద విషయం అలాంటి సందర్భం వస్తే దాన్ని ఒక వేడుకల అందరికీ తెలిసేలాగా చేసుకుంటానని వెల్లడించింది. మా ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని అడుగుతుంటారు. కానీ నన్నేమీ తొందర పెట్టలేదంటూ తన మనసులో మాటని బయట పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Exit mobile version