Site icon Prime9

Tamannaah marriage with a Mumbai businessman:ముంబై వ్యాపారవేత్తతో తమన్నా పెళ్లి

Tamannaah

Tamannaah

Tamannaah: మిల్కీబ్యూటీ తమన్నా భాటియా పెళ్లికి సిద్దమయింది. ఆమెకు ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో పెళ్లి ఫిక్స్ అయిందని అంటున్నారు. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ . గత కొద్ది రోజులుగా ఆమె పెళ్లికి సంబంధించిన పుకార్లు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.పెళ్లి నిజమనో లేక అబద్ధమానో ఒక్క కామెంట్ కూడా చేయలేదు తమన్నా.

రెండేళ్లకిందట తమన్నా భాటియా పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వదంతులు వచ్చాయి. అయితే తమన్నా ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. దానితో ఈ పుకార్లు ఆగిపోయాయి.తమన్నా ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్స్‌ని అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఆమె రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. తమన్నా త్వరలో  గుర్తుందా సీతాకాలం చిత్రంలో కథానాయికగా కనిపించనుంది.

 

Exit mobile version