Site icon Prime9

Suriya-Siruthai Siva: సూర్య కొత్త సినిమా

Surya New Movie: సూర్య పేరు వినగానే మనకి బాగా గుర్తు వచ్చే సినిమా గజినీ. నటుడిగా సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో సూర్య ఎక్కడికో వెళ్ళిపోయాడు. నటుడిగా సూర్య మరో స్థాయికి వెళ్లాడు. ఎవరికీ తలవంచడు అనే సినిమాతో సూర్యకు ఒక ఫ్లాప్ వచ్చింది. ఇప్పుడు సూర్య మరో కొత్త సినిమాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా ఎప్పుడో పూర్తి అయ్యాయి.

మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన శివ ఇప్పుడు సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. శివ కథలను డిఫరెంటుగా క్రియోట్ చేస్తాడు. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో సూర్య, అగ్ర దర్శకుడు శివ కాంబినేషన్‌లో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ నెం 25గా యువి క్రియేషన్స్‌తో కలిసి ఒక భారీ ప్రాజెక్టుకు తియ్యడానికి ఈ సినిమా షూటింగ్ మొదలైంది. సినిమా యూనిట్‌తో పాటు సినీ పెద్దల సమక్షంలో ఓపెనింగ్ జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ ను అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ ఇవ్వనున్నారు. మంచి టాలెంట్ ఉన్న దర్శక నిర్మాతలు ఎంచుకుంటూ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును, మంచి పేరును సంపాదించుకున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ మరియు స్టూడియో గ్రీన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు.

 

Exit mobile version