Site icon Prime9

#Oh My Ghost: కోరిక తీరని “గ్లామరస్ క్వీన్”గా సన్నీలియోన్.. “ఓ మై ఘోస్ట్” ట్రైలర్ అదుర్స్

sunny Leone oh my ghost movie trailer out

sunny Leone oh my ghost movie trailer out

#Oh My Ghost: సన్నీలియోన్ కుర్రకారు క్రష్. ఈ పేరు వింటే కుర్రకారులో జోష్ మాములుండదు. కాగా ఈ ప్రముఖ బాలీవుడ్ నటి ప్రస్తుతం తమిళనాట ‘ఓ మై ఘోస్ట్’ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి పునరాగమనం చేస్తోంది. బుధవారం నాడు చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ఈవెంట్ కు సంబంధించి సన్నీలియోన్ ఫొటోలు మరియు ట్రైలర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

అడల్ట్ హారర్ కామెడీ నేపథ్యంలో ఓ మై ఘోస్ట్ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సన్నీ లియోన్ ఓ ముఖ్య పాత్ర పోషించడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలను రేకెత్తిస్తుంది. ఈ మూవీలో సన్నీ లియోన్ గ్లామరస్ క్వీన్‌గా నటించింది. నెరవేరని కల కారణంగా దెయ్యంగా మారిన ఈమె ఏం చేస్తుంది అనే ఆసక్తికరమైన అంశంతో ఈ కథ కొనసాగుతున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో యోగి బాబు, సతీష్, దర్శ గుప్తా, రమేష్ తిలక్ మరియు జిపి ముత్తుల వంటి ప్రముఖ నటులు హాస్య పాత్రలు పోషించడం సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చింది. ‘సిద్ధనై సెయ్’ మూవీ ఫేమ్ ఆర్ యువన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 13 ఏళ్ల తర్వాత అతను ఈ చిత్రంతో తిరిగి తెరపైకి రానుండడంతో ప్రేక్షకులలు ఇది ఓ మంచి వినోదాత్మక చిత్రం అవుతుందని తమిళ ఇండస్ట్రీ నాట టాక్ వినపడుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. కాగా ఈ మూవీకి జావేద్ రియాజ్ సంగీతం అందించగా,ధరన్ కుమార్ నేపథ్య సంగీతం అందించారు.

జై ప్రధాన పాత్రలో నటించిన ‘వడకురి’ చిత్రంతో సన్నీలియోన్ తమిళంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చారిత్రాత్మక తమిళ చిత్రం ‘వీరమాదేవి’ కోసం దర్శకుడు వడివుడైయన్‌తో ఈ ముద్దుగుమ్మ చేతులు కలిపింది.

ఇదీ చదవండి: విజువల్ వండర్ గా “అవతార్ ది వే ఆఫ్ వాటర్” ట్రైలర్

Exit mobile version