Site icon Prime9

వీరసింహారెడ్డి మూవీ: బాలకృష్ణ వీరసింహారెడ్డి నుంచి మరో అప్డేట్.. ఉర్రూతలూగించే “సుగుణ సుందరి” లిరికల్ సాంగ్ రిలీజ్

suguna sundari song release from balakrishna veera simha reddy movie

suguna sundari song release from balakrishna veera simha reddy movie

Veera Simha Reddy Movie: నటసింహ నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్‌ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షన్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, మాస్ సాంగ్ అన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తమన్ అందించిన సంగీతం మరింత బిగ్ అట్రాక్షన్ అయితే వీరసింహారెడ్డి టీం మరో సరికొత్త అప్డేట్ ఇచ్చి బాలయ్య అభిమానులను ఖుషీ చేసింది. సుగుణ సుందరి అంటూ సాగే హుషారైన లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు చిత్ర బృందం.

‘సీమా కుట్టిందే.. సిట్టి సీమా కుట్టిందే.. దిల్లు కందిపోయే లాగా దిట్టంగా కుట్టిందే’ అనే లిరిక్స్ తో సాగుతున్న ఈ పాట అటు మాస్, ఇటు క్లాస్ అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది. అయితే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అఖండ తర్వాత బాలకృష్ణ నటించిన యాక్షన్, పవర్ ప్యాక్డ్ చిత్రంగా వీరసింహారెడ్డి తెరకెక్కనుండడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 15 గురువారం నాడు చిత్ర బృందం సుగుణ సుందరి పాటను రిలీజ్ చేశారు.

రామజోగయ్యశాస్త్రీ సాహిత్యం సమకూర్చిన ఈ పాటకు రామ్ మిర్యాల, స్నిగ్ద శర్మ గానం అందించగా శేఖర్ మాస్టర్ స్టెప్పులు వేయించాడు. ఫుల్ మాస్, మసాలాతో కూడిన ఈపాటలో బాలయ్య, శృతి హాసన్ మంచి గ్రేస్ ఫుల్ గా స్పెప్పులేశారు. ఇకపోతే ఫ్యాక్షన్, యాక్షన్ కథ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. బుర్రా సాయి మాధవ్ మాటలు అందించారు. పవర్‌ఫుల్ డైలాగ్స్ తో విడుదలైన టీజర్‌ ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచిందని చెప్పాలి. ఇక ఈ సినిమాను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి ఉండాల్సిందే.

ఇదీ చదవండి: ఇక సినిమాలకు గుడ్ బై అంటున్న తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్.. ఎందుకంటే..?

Exit mobile version