Site icon Prime9

Sreeleela: పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల తల్లిపై కేసు నమోదు

sreelela prime9news

sreelela prime9news

Sreeleela: కొంత మంది నటీనటులు తమ అందం, అభినయంతో పాపులర్ అవుతూ ఉంటారు. కానీ శ్రీలీల మొదటి సినిమాతోనే తన గ్లామర్‌తో పాటు పర్సనల్ విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీలీల తల్లి స్వర్ణలతపై FIR నమోదుకావడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలీల తల్లి స్వర్ణలతపై కర్ణాటకలోని అడుగుడి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. శ్రీలీల తండ్రి శుభకర్ రావు .. స్వర్ణలతపై పోలీస్ స్టేషన్‌లో కంప్టైంట్ ఇచ్చారు. శ్రీలీల తండ్రి, తల్లి ఇద్దరు 20 యేళ్లు నుంచి విడివిడిగా ఉంటున్నారు. వీళ్ళ విడాకుల పిటిషన్ అప్పటి నుంచి కోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఇదే నేపథ్యంలో అక్టోబర్ 3న బెంగళూరులో కోరమంగళలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లోకి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా స్వర్ణలత వచ్చిందని, అంతేకాదు అపార్ట్‌మెంట్ డోర్ ను పగలగొట్టి లోపలికి వెళ్ళినట్టు శుభకర్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై శ్రీలీల తండ్రి సీరియస్ అయి అక్రమంగా తన ఇంట్లో ప్రవేశించినందున స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆయన కంప్టైంట్ ఇవ్వడంతో పోలీసులు స్వర్ణలత పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Exit mobile version