Site icon Prime9

Sitara Ghattamaneni : ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న సితార .. వైరల్ గా దివాళి స్పెషల్ ఫోటోలు..

sitara diwali special post

sitara diwali special post

Sitara Ghattamaneni :మహేష్ బాబు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . మహేష్ బాబు కూతురిగా ఆయన గారాల పట్టి సితార అందరికి తెలిసినా గత కొంతకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడూ ఫోటోలు, పలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. చిన్న ఏజ్ లోనే తనకంటూ వున్న టాలెంట్ ని చూపుతూ ఎందరినో అభిమానులను సంపాదించుకుంది . సోషల్ మీడియా లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. తన యాక్టివ్ నెస్ తో అందర్నీ కట్టిపడేసింది.  తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోంది.

చదువుతో పాటు మరో పక్క మన కల్చరల్ కి సంబంధించినవి అన్ని నేర్చుకుంటూ ప్రతి పండుగకు  పద్దతిగా తెలుగింటి కుందనపు బొమ్మలా రెడీ అయి పూజలు చేసి, ఫోటోలు కూడా షేర్ చేస్తుంది. ఎంత మోడల్ గర్ల్ అయిన మన తెలుగు పండుగల సమయం లో మాత్రం తెలుగు తనం ఉట్టిపడేలా ఎంతో సంప్రదాయంగ పూజలు చేస్తూ ఫోటోలు షేర్ చేస్తుంది.

తాజాగా దీపావళి సందర్భంగా ఉదయాన్నే లేచి ఇంటి ముందు ఎంతో అందంగ సంప్రదాయంగ అలంకరించుకొని తన ఇంటి ముందు ముగ్గులు వేసింది. తన ఇంట్లో పనిచేసే వాళ్ళతో కలిసి సితార ముగ్గులు వేయడం తన సింప్లి సిటీ కి ప్రూఫ్ . సితార ముగ్గులు వేస్తున్న ఫోటోలని, తాను వేసిన ముగ్గుని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అలాగే గాగ్రా చోళీ డ్రెస్ లో దీపం పట్టుకొని దీపావళికి స్పెషల్ ఫోటోలు కూడా ముందే పోస్ట్ చేసింది సితార. ఇక రాత్రికి దీపావళి సెలెబ్రేట్ చేసుకునే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తుందని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అభిమానులు, ఫాలోవర్లు కామెంట్స్ లో సితార పాపకి హ్యాపీ దీపావళి చెప్తున్నారు.

ఇక ఇటీవల ఓ యాడ్ కూడా చేసి మెప్పించింది.ఒక ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ PMJ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే సితార న‌టించిన క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌కు సంబంధించిన ఫొటోల‌ను ప్రెస్టీజియ‌స్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్ర‌ద‌ర్శించారు. అప్పటిలో దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ‌ వైర‌ల్ అయ్యాయి ,దానికి అభిమానులు చిన్న వయసులో సితారకి దక్కిన గొప్ప గౌరవం అంటూ కామెంట్స్ చేశారు . తండ్రి బాటలోనే కొన్ని మంచి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది .

Exit mobile version