Site icon Prime9

Shruti Haasan : పద్దతిగా పట్టుచీరలో శృతిహాసన్ .. బాయ్ ఫ్రెండ్ తో దీపావళి వేడుకలు ..

shruti-haasan-diwali-celebrations-with-her-boy-friend

shruti-haasan-diwali-celebrations-with-her-boy-friend

Shruti Haasan : శ్రుతి హాసన్ కమల్ హాసన్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది . ఇక ఈ మూవీ అనంతరం శ్రుతికి టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది.కాగా శృతి హాసన్.. డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

గతంలో మైకెల్ తో బ్రేకప్ అయ్యాక.. బాగా డిస్టర్బ్ అయిన శృతి ఆ తర్వాత శంతనుతో డేటింగ్ చేస్తుంది. వీళ్ళ లవ్ గురించి బహిరంగంగానే ఎప్పుడో చెప్పేసింది. ఇద్దరూ ముంబైలో కలిసే నివసిస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. రెగ్యులర్ గా శృతి తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తాజాగా దీపావళి కావడం తో ఈ సందర్భంగా శృతి తన బాయ్ ఫ్రెండ్ శంతనుతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఎప్పుడూ హాట్ మోడరన్ డ్రెస్సుల్లో కనిపించే శృతి హాసన్ దీపావళి రోజు పద్దతిగా పట్టుచీర కట్టుకుంది. తన బాయ్ ఫ్రెండ్ శంతను కూడా పద్దతిగా పట్టుపంచె కట్టాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శృతి. దీంతో వీరి ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే పెళ్లి కాకుండానే ఇద్దరూ కలిసి నివసిస్తూ, ఇలా పండగలు సెలబ్రేట్ చేసుకుంటూ మరింత వైరల్ అవుతున్నారు ఈ జంట. అయితే ట్రెడిషనల్ వైపు ఇక అడుగు వేశారు కాబట్టి వీరి పెళ్ళి విషయం ఏమైనా చెపుతారేమో చూడాలి .

 

Exit mobile version