Site icon Prime9

Priyanka Chopra : మెట్ గాలా ఈవెంట్ లో ప్రియాంక చోప్రా ధరించిన డైమండ్ నెక్లెస్‌ ధర తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే.. ఎన్ని వందల కోట్లంటే ?

shocking details about priyanka chopra necklase cost

shocking details about priyanka chopra necklase cost

Priyanka Chopra : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతుంది. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. హిందీ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో కూడా తన సత్తాను చాటుతూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రియాంక తెలుగులో కూడా రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా హిందీలో ‘జంజీర్’గా విడుదలైంది. ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ మూవీ అమితాబ్ ఆల్ టైమ్ క్లాసిక్ ‘జంజీర్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. కాగా హాలీవుడ్‌ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రియాంకా చోప్రా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక సినిమాలతో పాటు ఫిలిం ఫెస్టివల్స్‌, ఈవెంట్స్‌లో కూడా తన ట్రెండీ ఫ్యాషన్‌ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటుంది ప్రియాంక. తాజాగా మెట్ గాలా ఈవెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక మన భామ ప్రియాంక లుక్ అయితే నెట్టింట సెగలు పుట్టిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ మెట్ గాలా ఈవెంట్ లో ప్రియాంక బ్లాక్ అవుట్‌ ఫిట్ లో భర్త నిక్‌తో కలిసి జంటగా కనిపించింది. చేతులకు వైట్ గ్లౌజెస్, బెల్ స్లీవ్స్‌తో మెరిసిపోతుంది. ఇక ఆమె అందానికి బల్గారీ స్టేట్‌మెంట్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ప్రియాంక ధరించిన నెక్లెస్‌లో పియర్ షేప్డ్ బ్లూ డైమండ్ పొదిగి ఉంది. ఇది అరుదైనదే కాక బల్గారి కలెక్షన్‌కు సంబంధించి అత్యంత విలువైన జెమ్. 11.6 క్యారెట్ల ఈ డైమండ్ అని తెలుస్తుంది. దీని ధర గురించి నెటిజన్లు శోధించగా ఈ నెక్లెస్ విలువ దాదాపు 25 మిలియన్ డాలర్లు అని తెలుస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 204 కోట్లు ఉంటుందన మాట. దీంతో ఈ నెక్లెస్ ధర గురించి తెలుసుకున్న నెటిజన్లు అంతా మామూలు ప్రజలకి ఈ ధరలు తెలిస్తే కళ్ళు తిరగడం గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. పెళ్లి తర్వాత హాలీవుడ్‌కు పూర్తిగా మకాం మార్చేసిన ప్రియాంక ఇప్పుడు కూడా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉంది. క్వాంటికో టీవీ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించిన ఈ భామ.. ఇటీవలే అమెరికన్ వెబ్ సిరీస్ ‘సిటడెల్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో రిచర్డ్ మాడెన్, స్టాన్లీ టుసీ, లెస్లీ మాన్విల్లే తదితరులు నటించారు. ఇక ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ఈ సిరీస్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే మరోవైపు హిందీలో కత్రినా కైఫ్, అలియా భట్‌తో కలిసి ‘జీ లే జరా’ చిత్రం చేస్తుంది ప్రియాంక.

Exit mobile version