Site icon Prime9

Ram Gopal Varma: ఆమె ఆత్మగా తిరిగి వచ్చి అతన్ని 70 ముక్కలుగా కోయాలి.. ఢిల్లీ హత్య పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్

Ram Gopal Varma

Ram Gopal Varma

Ram Gopal Varma Tweet: ఢిల్లీలో శ్రద్దా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న ఆఫ్తాబ్ పూనావాలా కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

విశ్రాంతి తీసుకునే బదులు ఆమె ఆత్మగా తిరిగి వచ్చి అతన్ని 70 ముక్కలుగా కోయాలి. క్రూరమైన హత్యలను చట్ట భయంతో అడ్డుకోలేము.. కానీ బాధితుల ఆత్మలు తిరిగి వచ్చి వారి హంతకులను చంపితే వాటిని ఖచ్చితంగా అరికట్టవచ్చు.. ఈ విషయాన్ని ఆలోచించి అవసరమైన విధంగా చేయవలసిందిగా భగవంతుడిని వేడుకుంటున్నాను అంటూ వర్మ ట్వీట్ చేసారు.

మరోవైపు, మహిళలపై ఇలాంటి భయంకరమైన నేరాలకు పాల్పడే వారికి బలమైన సందేశం పంపడానికి శ్రద్ధా వాకర్‌ను చంపిన అఫ్తాబ్ అమీన్ పూనావల్లాను బహిరంగంగా ఉరితీయాలని శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.

Exit mobile version