Site icon Prime9

Sanjay Dutt : షూటింగ్ స్పాట్ లో బాంబ్ పేలి తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్..

sanjay dutt got seriously injured in movie shooting spot

sanjay dutt got seriously injured in movie shooting spot

Sanjay Dutt : బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ గురించి దేశ వ్యాప్తంగా తెలిసిందే. రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ కారణంగా కూడా సంజయ్ గురించి ప్రజలు బాగా తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ హీరో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. కాగా సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడం సాధారణ విషయమే. అయితే ఇటీవల షూటింగ్స్ లో పలువురు హీరోలు గాయపడిన వార్తలు మనం గమనించవచ్చు. విశాల్, విజయ్ ఆంటోని, నాగ శౌర్య ఇలా పలువురు హీరోలు గాయపడ్డారు. తాజాగా ఇప్పుడు మూవీ షూటింగ్ లో ససంజయ దత్ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.

సినిమా సెట్ లో బాంబు పేలడంతో సంజయ్ కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం కన్నడ చిత్రం ‘కెడి’ సెట్స్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో సంజయ్ కు చేతి, మోచేయి, ముఖంపై గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తలరించారు అక్కడి వారు. ఫైట్ మాస్టర్ రవి వర్మ సమక్షంలో ఈ సీన్ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో షూటింగ్‌లో వినియోగించేందుకు ఉంచిన బాంబు ఒక్కసారిగా పేలింది. దాంతో సంజయ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సంజయ్ దత్ ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స జరుగుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.

ప్రస్తుతం సంజయ్ దత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కేజీఎఫ్ సినిమాలో అధీరా గా నటించి మెప్పించారు సంజయ్. ఇప్పుడు మరో కన్నడ సినిమాలో చేస్తున్నారు. షూటింగ్ లో సంజయ్ గాయపడ్డారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సంజయ్ దత్ సుదీర్ఘ కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఇటీవలే డని నుంచి బయటపడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఘటనతో ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా బాధ పడుతున్నారు.

Exit mobile version