Samantha Injured: నటి సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ వ్యాధి కోలుకున్న సమంత షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే తాజాగా షూటింగ్ లో పాల్గొన్న సమంత గాయపడ్డారు. ప్రస్తుతం సమంత బాలీవుడ్ , హాలీవుడ్ సినిమాలతో పాటు ‘సిటాడెల్ ’ అనే వెబ్ సిరీస్ లోను నటిస్తోంది.
యాక్షన్ ఫలితం అంటూ సామ్ పోస్ట్ (Samantha Injured)
ఈక్రమంలోనే షూటింగ్ లో తనపై పలు యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా సమంత గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సామ్ సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించింది. షూటింగ్ లో గాయపడటంతో తన రెండు చేతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాయాలైన చేతుల ఫొటోను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ ‘యాక్షన్ ఫలితం’ అంటూ కామెంట్ రాసింది సమంత.
యాక్షన్ థ్రిల్లర్‌గా ‘సిటాడెల్’
మూవీ షూటింగ్స్ ప్రారంభించిన సామ్ మొదట సిటాడెల్ వెబ్ సిరీస్ సెట్‌లో అడుగుపెట్టింది. ఈ హిందీ సరీస్ లో నటుడు వరుణ్ ధావన్ , సమంత((Samantha Injured) కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్ ను ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్, డికే రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రుస్సో బ్రదర్స్ తీస్తున్న ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌కి ఇది ఇండియన్ అడాప్షన్. ఓరిజినల్ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మడ్డెన్, స్టాన్లీ టుస్సీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత పలు యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుండగా గాయాలు అయినట్టు తెలుస్తోంది.