Site icon Prime9

Samantha: #NTR30 మూవీకి నో చెప్పిన సమంత

Tollywood: పుష్ప చిత్రంలోని ’ఊ అంటావా‘ పాట ద్వారా నటి సమంత మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఆమెను తిరిగి వెలుగులోకి తెచ్చింది. చాలా మంది నిర్మాతలు ఆమె కాల్షీట్లకోసం సంప్రదించడం ప్రారంభించారు.

సమంత క్రేజ్ చూసి దర్శకుడు కొరటాల శివ సమంత దగ్గరకు వెళ్లి #NTR30లో కథానాయిక పాత్ర కోసం అడిగినట్లు సమాచారం. అయితే సమంత కేవలం రెమ్యునరేషన్ డిమాండ్ ఆధారంగానే సినిమాని తిరస్కరించిందని సన్నిహితులు వెల్లడించారు. కొరటాల శివ సీనియర్ రెమ్యునరేషన్‌గా రూ.2.5 కోట్లు ఆఫర్ చేయగా, ఆమె రూ. 4 కోట్లు అడిగినట్లు తెలిసింది. ఇది శివను షాక్ కు గురిచేసిందని దానితో ఈ ప్రపోజల్ అక్కడితో ఆగిపోయిందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, పూజా హెగ్డే మరియు రష్మిక మందన్న వంటి వారు కూడా అదే పారితోషికాన్ని పొందుతున్నందున సమంత ఇప్పుడు రూ.4 కోట్లు డిమాండ్ చేయాలని భావించింది.

Exit mobile version