Attack on Saif Suspect caught on camera: బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తి దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఇంట్లోని సీసీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు పోలీసులు. ఇందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా సైఫ్ పై జరిగిన దాడి ఘటనతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ రోజు తెల్లవారు జామును ముంబైలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.ఒంటిపై ఆరు చోట్ల కత్తి పోట్లు పడ్డాయి. దాడి అనంతరం దుండగుడు పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న సైఫ్ ని ఆయన తనయుడు ఇబ్రహీం అలీఖాన్ ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఉదయం తెల్లవారు జామును 2 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన జరగగా.. 3 గంటల 30 నిమిషాలకు సైఫ్ ని లీలావతి ఆస్పత్రి తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైఫ్ ఇంటి సీసీ కెమెరాలను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
VIDEO | Attack on Saif Ali Khan: CCTV footage shows the alleged attacker fleeing the building through staircase.
(Source: Third Party)#SaifAliKhanInjured pic.twitter.com/VHpAenxFdu
— Press Trust of India (@PTI_News) January 16, 2025
సైఫ్ పై ఈ దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఘటన జరిగే సమాయానికి రెండు గంటల ముందు వరకు సైఫ్ ఇంట్లోకి ఎవరూ వచ్చినట్టు కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే దొంగ ముందురోజు రాత్రే ఇంట్లోకి వచ్చినట్టు చెబుతున్నారు. సైఫ్ శత్రువులు ప్లాన్ ప్రకారమే అతడిపై దాడి చేయించారా? లేదా తిలిసనవాళ్లే ఈ పని చేయించారా? అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాత్రంతా ఇంట్లోనే దాక్కున్న దొంగ గురువారం తెల్లవారు జామున దొంగతనానికి ప్రయత్నించాడు. సైఫ్ అలీ ఖాన్ పిల్లల బెడ్ రూం దగ్గరే దుండగుడు పనిమినిషితో ఘర్షణ పడినట్టు తెలుస్తోంది.
ఆ అలికిడి లేచిన సైఫ్ దొంగని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తొపులాట జరిగింది. అప్పుడే దుండగుడు సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. ఆరుసార్లు కత్తితో పోడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో హుటాహుటిన తండ్రి ఆయన పెద్దకుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ లీలావతి ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యులు సైఫ్ వెన్నుముకలో కత్తి మొన విరిగినట్టు గురించారు. దీంతో సర్జరీ చేసి దానికి తొలగించామని, అలాగే మెడ భాగంతో లోతైన గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు ఆయన హెల్త్ బులిటెన్ లో వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆయనకు ప్రాణాప్రాయం ఏం లేదని వైద్యులు తెలిపారు.