Site icon Prime9

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌ దాడి కేసు – నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచన పోలీసులు, 5 రోజల కస్టడీకి అనుమతి

Saif Ali Khan Case Latest Update: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మహ్మద్‌ షరీఫుల్‌ ఇస్లాం షెహజాద్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కాసేపటి క్రితమే అతడిని బాంద్రాలోని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఇరువురి వాదోపవాదాలు విన్న న్యాయస్థానం పోలీసుల విజ్ఞప్తి మేరకు నిందితుడి ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో అతడి బాంద్రా పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా నిందితుడి తరపు న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు సరిగ చేయలేదని ఆరోపించారు.

“మహ్మద్‌ షరీపుల్‌ బంగ్లాదేశీయుడు అని పోలీసులు అంటున్నారు. కానీ ఇది నిజమని చెప్పడానికి పోలీసుల దగ్గర సరైన ఆధారాలు లేవు. ఆరు నెలల క్రితం బంగ్లాదేశ్‌ నుంచి అతడు అక్రమంగా భారత్‌లోకి చోరబడ్డాడని అంటున్నారు. అందులో నిజం లేదు. దాదాపు ఏడేళ్ల క్రితమే అతడు భారత్‌కి వచ్చాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే నివసిస్తున్నారు. ఇదే విషయాన్ని మేము కోర్టుకు తెలిపాం. దీంతో పోలీసులు ఐదు రోజులు కస్టడీ అడిగారు. ఈ మేరకు కోర్టు ఐదురోజుల్లోగా అన్ని ఆధారాలు ఇవ్వాలని ఆదేశిస్తూ కస్టడీకి అనుమతిని ఇచ్చింది” అని వారు పేర్కొన్నారు.

కాగా గురువారం తెల్లవారుజామున నిందితుడు సైఫ్‌ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు జహింగీర్‌ రూమ్‌లో దూరిన అతడిని కేర్‌ టేకర్‌ గమనించి కేకలు వేసింది. అరవద్దంటూ దుండగుడు ఆమెను కత్తితో బెదిరించాడు. ఆమె అరుపులకు నిద్ర నుంచి మేల్కొని అక్కడికి వచ్చాడు సైఫ్‌. దీంతో పనిమనిషి బంధించి బెదిరింపులకు దిగగా.. సైఫ్‌ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో నిందితుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఒంటిపై ఆరు చోట్ల కత్తిగాట్లు పడగా.. మెడ భాగంతో లోతుగా కత్తి గాటుతో పాటు వెన్నుముకలో రెండు అంగుళాల కత్తి మొన విరిగినట్టు గుర్తించారు. దీంతో ఆయనకు సర్జరీ చేసి దానికి తొలగించి.. మెడ భాగంలో ప్లాస్టిక్‌ సర్జరీ చేసినట్టు వైద్యలు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడిని నిన్న అదుపులోకి తీసుకోగా నేడు కోర్టు ముందు హాజరుపరిచారు.

నిందితుడిని కస్టడీ తీసుకుని విచారించగా.. అతడు దొంగతనం కోసమే సైఫ్  ఇంట్లోకి చొరబడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. తాను మొదట షారుక్‌ ఖాన్‌ ఇంటిని టార్గెట్‌ చేశానని, జనవరి 14న ఆయన ఇంట్లో దొంగతానికి ప్లాన్ చేసినట్టు చెప్పాడు. అయితే హై సెక్యూరిటీ ఉండటంతో వెళ్లలేకపోయానని, దీంతో సైఫ్‌ ఇంట్లోకి దొంగతానికి వచ్చినట్టు చెప్పిట్టు తెలిపారు. అతడు భారతీయుడు కాదని, ఆరు నెలల క్రితమే బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చినట్టు తమ ప్రాథమిక విచారణ తేలినట్టు పోలీసులు తెలిపారు. భారత్‌ వచ్చాక విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడన్నారు. అతడు భారతీయుడు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కాబట్టి అతడిని కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీ కోరి తదుపరిచ విచారణ చేపడతామని పోలీసులు మీడియాకు తెలిపారు.

Exit mobile version