Site icon Prime9

Sai Pallavi : సినిమాకై భారీగా డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి .. నిర్మాతలు సైతం సరే అంటూ..

sai-pallavi-demands-high-remuneration-in-naga-chaithanya-movie

sai-pallavi-demands-high-remuneration-in-naga-chaithanya-movie

Sai Pallavi : సాయిపల్లవి .. టాలీవుడ్ బ్యూటీ, కాదు కాదు న్యాచురల్ బ్యూటీ . గ్లామర్ రోల్స్ చేయకున్న కూడా ఈమె నటనతో  ఈ ముద్ధుగుమ్మ ఎందరినో అభిమానులను సొంతం చేసుకుంది. తన అభినయంతో , డాన్స్ తో ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకుంది.సాయిపల్లవి మొదట ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను అందుకుంది. ఇక మొదటి నుంచి కూడా సాయిపల్లవి గ్లామర్ రోల్స్ కు ఓకే చెప్పింది లేదు. కథ నచ్చి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప ఆమెఆ ఏ సినిమాను ఒప్పుకోదు.తన ప్రతి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ పెర్ఫార్మన్స్ చేస్తూ , డాన్స్ అదరగొట్టేది . తన డాన్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందరి స్టార్స్ కి సామాన్యులు అభిమానులుగా ఉంటే ఈమెకి మాత్రం స్టార్స్ అభిమానులుగా ఉంటారు. ఎంతో మంది స్టార్ హీరోలకి ఈమె ఫేవరెట్ హీరోయిన్ .

ఇక ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో ఒక సినిమా.. హిందీ రామాయణ్ లో సీతగా సెలెక్ట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగులో నాగ చైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే లవ్ స్టోరీ వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెల్సిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.2018లో గుజరాత్ నుండి 21 మంది మత్స్యకారులు వేటకెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌ చెరలో చిక్కుకోగా అందులో ఉన్న ఓ ఆంద్ర మత్స్యకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు ఇటీవల నిర్మాతలు తెలిపారు. ఇక ఈ సినిమాలో నాగ్ చైతన్య సిక్స్ ప్యాక్ కూడా చూపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుందని ప్రకటించిన తర్వాత సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా కోసం సాయిపల్లవి భారీగా డిమాండ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హీరోయిన్లు కూడా హీరోలకు ధీటుగా రెమ్యూనిరేషన్ అందుకుంటూ షాక్ ఇస్తున్నారు. ఇక కథను బట్టి, పాత్రను బట్టి హీరోయిన్స్ పారితోషికాలను డిమాండ్ చేస్తారు. ఇక హీరోయిన్స్ మార్కెట్ ను బట్టి నిర్మాతలు కూడా వారు ఎంత అంటే.. అంత ఇచ్చేస్తూ వస్తున్నారు. తండేల్ సినిమా కోసం సాయిపల్లవి దాదాపు రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక సాయిపల్లవి అడిగితే .. నిర్మాతలు ఇవ్వకుండా ఉంటారా.. ? ఆమె మార్కెట్ అలాంటింది మరి. అందుకే నిర్మాతలు సైతం ఓకే చెప్పినట్లు సమాచారం.కారణం ఆ పాత్రకి ఆమె మాత్రమే సెట్ అవుతుంది అని నిర్మాతల అభిప్రాయం . ఇక దానికి తగ్గట్టు ఆమె నటన కూడా ఎక్స్ట్రార్డినరీ గా ఉంటుంది. మరి తీసుకుంటున్న పారితోషికానికి ఎలాంటి న్యాయం చేస్తుందో , ఈ సినిమాతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

Exit mobile version