Site icon Prime9

Virupaksha Movie : ” విరూపాక్ష ” గా సుప్రీం హీరో… తారక్ వాయిస్ సూపర్ !

sai-dharam-tej-new-movie-virupaksha-glimpse-released

sai-dharam-tej-new-movie-virupaksha-glimpse-released

Virupaksha Movie : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ఇంటికే పరితమైన ఈ యంగ్ హీరో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. తన 15 వ మూవీతో ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమయ్యాడు. ఆ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తుండగా… ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి బీవీఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ ని మూవీ యూనిట్ విడుదల చేశారు. కాగా ఈ గ్లింప్స్‌ వీడియో కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం ప్రకటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ సినిమాకి ” విరూపాక్ష ” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆ వీడియో లో ” అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది.

విజువల్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మరోసారి తన టాలెంట్ ని అజనీష్ నిరూపించుకునేలా ఉన్నారు. ఇక పోతే ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అలానే టైటిల్ తో పాటు, రిలీజ్ డేట్ నీ కూడా అనౌన్స్ చేసేశారు మూవీ మేకర్స్. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా కొనసాగుతుంది.

YouTube video player

Exit mobile version
Skip to toolbar