Site icon Prime9

Akira Nandan : వైరల్ గా అకీరా నందన్ జిమ్ వీడియో.. బ్యాగ్రౌండ్ లో ఏం సాంగ్ వస్తుందంటే ?

renu desai post about akira nandan gym work outs video

renu desai post about akira nandan gym work outs video

Akira Nandan : పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ – రేణు దేశాయ్ త‌న‌యుడుగా అకీరా నంద‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది ప‌వ‌న్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్ప‌టికే న‌ట‌న‌, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్ష‌ణ తీసుకున్నాడు అకిరా. అకీరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. అకీరా బయట పెద్దగా కనిపించక పోయినప్పటికి.. సోషల్ మీడియా అకౌంట్ లేకపోయినప్పటికీ.. రేణుదేశాయ్.. అకీరాకి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే.. తాజాగా రేణుదేశాయ్ అకీరాకి సంబంధించిన ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో అకీరా జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ ఉన్నాడు. అకీరా వెనుక వైపు మాత్రమే కనిపిస్తుండగా.. టీ షర్ట్ పై ఆంజనేయ స్వామి బొమ్మ ఉండడం గమనార్హం. బ్యాగ్రౌండ్ లో ప్రభాస్ బాహుబలి 2 లోని “ఒక ప్రాణం” సాంగ్ వింటూ ఉండడంతో ఏఈ విద్వ చూసిన ప్రభాస్ ఫాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. ఇక ఆ వీడియోతో పాటు క్యాప్షన్ గా..  “జిమ్ చేసేటప్పుడు అర్ధంలేని ఇంగ్లీష్ పాటలు వినకుండా మన తెలుగు మరియు హిందీ పాటలు వింటున్నందుకు చాలా గర్వంగా ఉంది మై లిటిల్ బాయ్” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఇటీవలే అకిరా నందన్ (Akira Nandan) సంగీత దర్శకత్వం వహించిన ఓ షార్ట్ ఫిలిం రిలీజయింది. ఒక రచయితకు సంబంధించిన కథాంశంతో కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వంలో రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిలిం తెరకెక్కింది. ఈ సినిమాలో మనోజ్ అనే యువకుడు నటించాడు. ఈ షార్ట్ ఫిలింకు అకిరా నందన్ మ్యూజిక్ అందించాడు. నాలుగున్నర నిముషాలు ఉన్న ఈ షార్ట్ ఫిలింకు అకిరా అందించిన మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు, నెటిజన్లు అకిరా నందన్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

Exit mobile version
Skip to toolbar