Ravanasura OTT: మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం రావణాసుర. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఇటీవల విడుదలైన ఈ సినిమా కు మంచి టాక్ వచ్చింది. నెగిటివ్ షేడ్ లో కనిపించిన రవితేజ తన నటనతో అదరగొట్టాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్ , దక్షనగార్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించారు. అక్కినేని సుశాంత్ ముఖ్య పాత్రలో కనిపించాడు. రవితేజ ప్రొడక్షన్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
20 రోజులకే ఓటీటీలో( Ravanasura OTT)
థియేటర్స్ లో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న రావణాసుర సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మే తొలి వారంలో ఈ సినిమా ఓటీటీ లో ప్రసారం అవుతుందనే టాక్ వినిపించింది. అయితే ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా.. అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ అమెజాన్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. కాగా, రావణాసుర విడుదల అయి నెల రోజులు కాకముందే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఏది ఏమైనా థియేటర్ లో రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీలో మూవీ చూసే ఛాన్స్ దొరికందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ సినిమాకు హర్షవర్థన్ రామేవ్వర్, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
రావణాసుర కథ ఏంటంటే..
రవితేజ ఓ జూనియర్ లాయర్. క్రిమినల్ లాయర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఫరియా అబ్ధుల్లా దగ్గర రవితేజ పనిచేస్తుంటాడు. తన తండ్రిపై పడిన ఓ కేసు సంబంధించి వాదించమని మేఘా ఆకాశ్.. ఫరియా అబ్ధుల్లా దగ్గరకు వస్తుంది. కేసు వాదించడానికి ఫరియా ఒప్పుకోదు. అయితే మేఘా కు తొలి చూపులోనే పడిపోయిన రవితేజ.. ఎలాగైనా ఫరియా ను ఒప్పిస్తానని చెప్తాడు. అయితే ఆ కేసు ఫరియా ఎందుకు ఒప్పుకోదు? కేసు ఒప్పుకున్న తర్వాత ఏమౌతుంది? ఆ కేసు ఎవరు గెలుస్తారు? అనేవి సినిమాలో చూడాల్సిందే.